: నటి హేమమాలినిపై కోడ్ ఉల్లంఘన కేసు
బాలీవుడ్ నటి, బీజేపీ లోక్ సభ అభ్యర్థి హేమమాలినిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని మధుర నియోజకవర్గ పరిధిలో శ్రీ జై బాబా సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో రెండు రోజుల కిందట ఆమె ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. పాఠశాల పనివేళల్లో ఎన్నికల ప్రచార సభలను పెట్టడం కోడ్ ఉల్లంఘించినట్లే అవుతుందని ఏడీఎం ధీరేంద్ర సచార్ తెలిపారు. ప్రచార సమయంలో హేమ పరిమితికి మించి వాహనాలను ఉపయోగించినందుకుగాను ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు.