: 'గ్రీకు వీరుడు' ఆడియో ఏప్రిల్ 3న..
కింగ్ నాగార్జున మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కామాక్షి మూవీస్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో, నయనతార జతగా నాగార్జున నటించిన చిత్రం 'గ్రీకు వీరుడు' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఏప్రిల్ 3న జరుగనుంది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో పాటలు విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు.