: బాలయ్య నామినేషన్ కు ఏర్పాట్లు
అనంతపురం జిల్లా హిందూపురం నుంచి సినీ నటుడు బాలకృష్ణ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నామినేషన్ వేసేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు ఎలా ఉండాలనే దానిపై చర్చించేందుకు ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 16న సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో వెళ్లేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.