: ఏలూరులో కాంగ్రెస్ కార్యకర్తల విధ్వంసం
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఏలూరు అసెంబ్లీ టికెట్ ను పద్మరాజుకు ఇవ్వడంపై కార్యకర్తలు కన్నెర్ర చేశారు. వైఎస్సార్సీపీలో పనిచేసిన పద్మరాజుకు టికెట్ ఎలా కేటాయిస్తారని వారు నిలదీశారు.
ఇవాళ ఉదయం ఏలూరులోని పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలకు వచ్చిన పద్మరాజును కార్యకర్తలు అడ్డుకున్నారు. పద్మరాజు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.