: 420 నెంబర్ నాకు వద్దు గాక వద్దు


కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల జాబితాతో పెద్ద చిక్కే వచ్చిపడింది. జాతీయ పార్టీ కావడంతో అధినాయకత్వంలోని పెద్దలు ఢిల్లీలో కసరత్తులు చేసి అభ్యర్థుల జాబితా రూపొందించి విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా జాబితాలోని ఓ సంఖ్యపై ఆ పార్టీలో పెద్ద వివాదమే రేగుతోంది. జాబితా ప్రకారం 420 నెంబర్ ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అజయ్ రాయ్ కు వచ్చింది.

దీంతో ఆయన జాబితాలో ఆ సంఖ్యపై తన పేరు ప్రకటిస్తే బాగోదని పార్టీ అధిష్ఠానాన్ని హెచ్చరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 419 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఆ సంఖ్యపై ఎవరి పేరు ప్రకటిద్దామనుకున్నా, అజయ్ రాయ్ చెప్పిన అభ్యంతరాన్నే వారు కూడా లేవదీస్తున్నారు. ఇంతకీ వారి అభ్యంతరమేంటంటే..! 420 అంటే చీటర్, దొంగ అని అర్థం. ఆ సంఖ్య తమతో కానీ, తమ పేరుతో కానీ జతపడడాన్ని ఎవరూ ఇష్టపడరు. దీంతో ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా అదే అభ్యంతరాన్ని లేవదీస్తున్నారు.

అజయ్ రాయ్ వారణాసిలో పెద్ద మాఫియా డాన్. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన సొంత సైన్యం వెంబడిస్తుంది. దీంతో ప్రత్యర్థులు తనను 420 అని ఎక్కడ విమర్శలకు దిగుతారోనని రాయ్ భయపడుతున్నారు. ఎవరిని ఆ స్థానంలో పెడదామా? అని కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది.

  • Loading...

More Telugu News