: 'ఏక్ నిరంజన్' అంటున్న కేసీఆర్
గత ఎన్నికల్లో టీడీపీ-వామపక్షాల కూటమితో పొత్తుపెట్టుకున్న టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా 2014 ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, పొలిట్ బ్యూరో సమావేశాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదన్నవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. వచ్చే నెల 10లోగా పార్టీ కమిటీల నియామకం ముగించాలని ఆదేశించారు.