: పార్టీ ఏ పదవి ఇచ్చినా అంగీకరిస్తా: అద్వానీ
సార్వత్రిక ఎన్నికల అనంతరం కచ్చితంగా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేతలు మరింత ధీమాతో ఉన్నారు. ఈ మేరకు గాంధీనగర్ లో నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం తనకు పార్టీ ఏ పదవి ఇచ్చినా అంగీకరించేందుకు సుముఖంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికల తర్వాత ఈ సారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ప్రజలు తొలిసారి అనుకుంటున్నారన్నారు. అయితే, అందులో ఎలాంటి అనుమానం లేదని.. తప్పకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నొక్కి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్టీకి మంచి ఫలితాలే వస్తాయన్నారు.