: విజయవాడలో టీడీపీ కార్యకర్తల ఆందోళన
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు టీడీపీలో గందరగోళం రేపింది. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించవద్దంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా పశ్చిమ సీటును ఇప్పటికే బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి కాంగ్రెస్ కు టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. దాంతో, ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.