: కేసీఆర్ పిరికిపంద, వంచకుడు: పొన్నాల


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ లా తాను మాట తప్పలేదని... ఆయనలా దౌర్భాగ్యపు మనిషిలా ఉండొద్దనుకుంటున్నానని పొన్నాల హైదరాబాదులో ఇవాళ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పిరికిపంద, వంచకుడు అంటూ ఆయన ఆరోపించారు. సకల జనుల సమ్మె సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేసీఆర్ పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో సామాజిక న్యాయం పాటిస్తామని పొన్నాల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని బంగారు తెలంగాణను నిర్మించేందుకు పాటు పడతామని ఆయన తెలిపారు. అమరుల త్యాగాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని పొన్నాల అన్నారు.

  • Loading...

More Telugu News