: పార్లమెంటు ఆవరణలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 124వ జయంతి వేడుకలు న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు ఆవరణలో ఇవాళ ఉదయం ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు. భారత దౌత్యవేత్త దేవయాని సహా పలువురు అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.