: మోడీ భార్యకు భారతరత్న ఇవ్వాలి: అస్సాం సీఎం


నరేంద్రమోడీ ప్రధాని కావాలంటూ ఉపవాసం చేసి తన త్యాగ నిరతిని తెలిపిన ఆయన భార్య జశోదాబెన్ కు తప్పకుండా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, త్యాగానికి, బాధకు ఆమె ఆదర్శమని ప్రశంసించారు. ఈ మేరకు బెన్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ మరో పది రోజుల్లో తాను కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. జశోదాకు వందసార్లు సెల్యూట్ చేస్తానన్నారు. గొప్ప భారతీయ స్త్రీగా ఆమె నిదర్శనమని కీర్తించారు. మౌనంగా ఉండి బాధననుభవించిన ఆమెలాంటివారు దేశంలో ఎవరూ లేరని, అందుకు ఇప్పటికే నోబెల్ బహుమతి పొంది ఉండాల్సిందని గొగోయ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News