: టీఆర్ఎస్ దోపిడీ దొంగల పార్టీ: విజయశాంతి


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మెదక్ అభ్యర్థి విజయశాంతి నిప్పులు చెరిగారు. ఈరోజు మెదక్ లో మీడియాతో విజయశాంతి మాట్లాడుతూ... టీఆర్ఎస్ కు అధికారమిస్తే దోచుకుతింటుందని అన్నారు. టీఆర్ఎస్ దొరల పార్టీ అని, బడుగు, బలహీన వర్గాలకు ఆ పార్టీ వ్యతిరేకమని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని విజయశాంతి విమర్శించారు.

ఓటమి భయంతోనే కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ దోపిడీ దొంగల పార్టీ, మోసం చేయడం వారి నైజం, కేసీఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలననే కొనసాగిస్తారని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

  • Loading...

More Telugu News