: గుండా మల్లేష్ కు రెబల్ గండం
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీపీఐ నేత గుండా మల్లేష్ కు రెబల్స్ దెబ్బ తగలనుంది. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. దీంతో టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత చిలుముల శంకర్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పోటీ నుంచి తప్పుకోవాలని సాక్షాత్తు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోరినా శంకర్ ససేమిరా అన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా గుండా మల్లేష్ ఫిర్యాదు చేశారు.