: అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఆ పార్టీ మరో నేత నవీన్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా నిన్న జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినందుకు వీరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.