: ప్రాంఛైజీలను దక్కించుకున్న సచిన్, గంగూలీ, సల్మాన్


ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్ బాల్ ఫ్రాంచైజీలను దక్కించుకునేందుకు ప్రముఖులు పోటీ పడ్డారు. కోచి ఫ్రాంచైజీని పీవీపీ వెంచర్స్ తో కలసి సచిన్ టెండూల్కర్ కొనుగోలు చేశాడు. వ్యాపారవేత్తలు హర్షవర్ధన్ నియోటియా, సంజీవ్ గోయంకాలతో కలసి కోల్ కతా ఫ్రాంచైజీని సౌరవ్ గంగూలీ చేజిక్కించుకున్నాడు. అలాగే, పూణే ఫ్రాంచైజీని సల్మాన్ ఖాన్, ముంబై ఫ్రాంచైజీని రణ్ బీర్ కపూర్, గువాహటి ఫ్రాంచైజీని జాన్ అబ్రహం కొనుగోలు చేశారు. బెంగుళూరు ఫ్రాంచైజీని సన్ గ్రూపు, గోవా జట్టును వేణుగోపాల్ గ్రూప్ కన్సార్టియం, ఢిల్లీ ఫ్రాంచైజీని సమీర్ మాంచందలు సొంతం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News