: చంద్రబాబుతో భేటీ అయిన కేశినేని నాని
కేశినేని ట్రావెల్స్ యజమాని, టీడీపీ నేత కేశినేని నాని ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడ లోక్ సభ స్థానంపై వీరిద్దరూ చర్చిస్తున్నారు. విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకున్న నానికి... విజయవాడ తూర్పు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని టీడీపీ అధిష్ఠానం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.