: తప్పిపోయిన విమానంపై ఆ ఆశా ఆవిరైంది


239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు వెళుతూ నెల క్రితం తప్పిపోయిన విమానాన్ని కనుగొనేందుకు ఉన్న ఒక్క అవకాశం కూడా ఆవిరైపోయింది. విమానంలోని బ్లాక్ బాక్స్ బ్యాటరీల కాలవ్యవధి ముగిసిపోయి ఉంటుందని భావిస్తున్నారు. వారం రోజుల క్రితం హిందూ మహా సముద్రంలో విమానం కోసం అన్వేషిస్తున్న నౌకలు, విమానాలు ఎలక్ట్రానిక్ సంకేతాలను అందుకున్నాయి. దీంతో విమానం అక్కడే కూలిపోయింటుందనే ఆశతో పెద్ద ఎత్తున అన్వేషణ పనులు కొనసాగుతున్నాయి. బ్యాటరీలు పనిచేస్తుంటే వాటి నుంచి సంకేతాలు రావడం వల్ల ఆచూకీ కనిపెట్టడానికి వీలుంటుంది. అయితే, తాజాగా ఆ సంకేతాలు కాస్తా ఆగిపోవడంతో బ్లాక్ బాక్స్ లోని బ్యాటరీలలో చార్జింగ్ అయిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఆ ప్రాంతంలో అన్వేషణ చర్యలు ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News