: ప్రచారం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ ను కోరాల్సిన పని లేదు: నారా లోకేష్
టీడీపీ తరపున ప్రచారం నిర్వహించాలని తన మామయ్య బాలకృష్ణ సహా ఎవరినీ కోరలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎవరికి వారే పార్టీ తమదిగా భావించి ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. విజయవాడకు వచ్చిన లోకేష్ ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ కోసం ప్రచారం చేయాలని ప్రత్యేకంగా కోరాల్సిన అవసరం లేదన్నారు. సీమాంధ్రను సింగపూర్ లా చేయకపోతే చంద్రబాబును నిలదియ్యండని సవాల్ చేశారు. అధికారంలోకి వస్తే అన్న ఎన్టీఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తామని చెప్పారు. పార్టీలో చేరే వారికి టికెట్లు ఇస్తామని తామేమీ హామీ ఇవ్వడం లేదన్నారు.