: ఒబామా ఆదాయం తగ్గింది


అమెరికా అధ్యక్షులవారి ఆదాయం 2013లో తగ్గిపోయింది. గతేడాదిలో ఒబామా ఆదాయం 4.81లక్షల డాలర్లు(రూ.2.88కోట్లు)గా ఉంది. ఇది 2012లో వచ్చిన ఆదాయం కంటే 21 శాతం తక్కువ. ఈ మేరకు ఒబామా ట్యాక్స్ రిటర్నుల వివరాలను అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. ఒబామా తాను రచించిన పుస్తకాల విక్రయం ద్వారా 2013లో 1.16లక్షల డాలర్ల ఆదాయాన్ని గడించారు. కానీ, పుస్తకాల అమ్మకం ద్వారా ఒబామాకు అంతకుముందు ఏడాదిలో 2.73లక్షల డాలర్ల రాయల్టీ రావడం గమనార్హం. పుస్తకాల విక్రయాలు తగ్గిపోవడమే ఆయన ఆదాయానికి గండి పడినట్లుగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News