: సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య ప్రీమియం రైలు
సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య ప్రీమియం రైలు సర్వీసు అందుబాటులోకి రానుంది. వేసవి రద్దీ దృష్ట్యా ఈ రైలును ఈ నెల 25 నుంచి నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. నెంబర్ 02723 సూపర్ ఫాస్ట్ రైలు 25న ఉదయం 10.10గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరుతుంది. మర్నాడు మధ్యాహ్నం 1.10గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. నెంబర్ 02724 రైలు 26న సాయంత్రం 7.05గంటలకు ఢిల్లీలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.05గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సాంబశివరావు తెలిపారు. ఈ రైలుకు ఈ రోజు నుంచీ బుకింగ్ ప్రారంభమవుతుంది.