: సోదరుడు వరుణ్ గాంధీపై ప్రియాంకాగాంధీ విమర్శలు


తన బాబాయి కొడుకు వరుణ్ గాంధీపై రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ తొలిసారిగా విమర్శలతో దాడి చేశారు. బీజేపీ నేత వరుణ్ గాంధీ తప్పుడు బాటను ఎంచుకున్నారని, ఆయనకు సరైన దారి చూపించాల్సి ఉందన్నారు. 'వరుణ్ మార్గం తప్పిన ఒక గాంధీ అంటూ ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో వ్యాఖ్యానించారు. వరుణ్ ఇక్కడి నుంచే బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేస్తున్నారు. 'నా సోదరుడు తిరిగి సరైన మార్గంలోకి వచ్చేలా దిశానిర్దేశం చేయండి'అని స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. నిజానికి ఇంత కాలం ఒకరినొకరు విమర్శించుకోకుండా వీరు ఒక సంప్రదాయాన్ని పాటించారు. తాజాగా దానికి స్వస్తి పలికినట్లు కనపడుతోంది. వరుణ్ ఈ నెలారంభంలో రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ మాట్లాడారు. అమేధీ అభివృద్ధికి రాహుల్ ఎంతో చేశారని, అలాంటి పనులనే సుల్తాన్ పూర్ లోనూ చేయాల్సి ఉందన్నారు. రాహుల్ ను మెచ్చుకున్న వరుణ్ పై ప్రియాంకాగాంధీ విమర్శలు చేయడం విశేషం.

  • Loading...

More Telugu News