: పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష కేసు నిందితులకు రిమాండ్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పీజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్ష కుంభంకోణం కేసులోని 10 మంది నిందితులను సీఐడీ అధికారులు ఈ రోజు విజయవాడ మూడో మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయస్థానం నిందితులకు రెండు వారాల రిమాండ్ ను విధించింది. దీంతో నిందితులందరినీ విజయవాడ సబ్ జైలుకు తరలించారు.