: బాలయ్య సినిమాకు చిక్కులు... లెజెండ్ నిలిపేయాలంటూ ఫిర్యాదు
బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాను నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపూరం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్లపై సినిమా ప్రభావం చూపుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అనంతపురం జిల్లా నేతలు నారాయణరెడ్డి, ఆదినారాయణ జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్‌కు తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలోని కథ, డైలాగులు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, కనుక సీమాంధ్ర, తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా ప్రదర్శన నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.