: సాయంత్రంలోగా సీమాంధ్ర అభ్యర్థుల తొలి జాబితా: రఘువీరా


సాయంత్రంలోగా సీమాంధ్రలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను వెల్లడిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి చిరంజీవి, రఘువీరా ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ... అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. కాగా, సీమాంధ్ర అభ్యర్థుల జాబితాపై అధినేత్రి సోనియా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 85 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను ఖరారు చేశారు.

  • Loading...

More Telugu News