: ‘ఆవిడ’ కంపెనీల వివరాలు చెప్పరేం?: సుబ్రహ్మణ్య స్వామి
న్యాయ శాఖామంత్రి కపిల్ సిబాల్ ఉద్దేశపూర్వకంగానే తన భార్య పేరిట ఉన్న కంపెనీల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో చెప్పలేదని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కపిల్ సిబల్ పై ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.
తన భార్య పేరిట ఉన్న మూడు కంపెనీలకు చెందిన ఆస్తులు, అప్పుల వివరాలను సిబల్ కావాలనే దాచిపెట్టారని ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మకు ఇచ్చిన ఫిర్యాదులో స్వామి ఆరోపించారు. అయితే, కపిల్ సిబల్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తాను బయటపెట్టకుండా ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే, వాటిని ఉచితంగా స్వామికి ఇచ్చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చారు కపిల్ సిబల్.