: రాష్ట్రానికి 400 కంపెనీల బలగాలు: భన్వర్ లాల్
ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వారం రోజుల్లో కేంద్రం నుంచి 400 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలు రాష్ట్రానికి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్ సభా స్థానాలకు పోటీ చేసిన 39 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు.
17 లోక్ సభా స్థానాలకు 267 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో తెలంగాణ ప్రాంతంలో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తామని భన్వర్ లాల్ తెలిపారు. తెలంగాణలో 2.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.80 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు పోలీసుల తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ. 93 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని భన్వర్ లాల్ తెలిపారు.