: బీజేపీకి సీట్లిస్తే...స్వతంత్రులను నిలబెడతాం: బాబుకు హెచ్చరిక
బీజేపీకి ప్రకాశం జిల్లాలో సీట్లు కేటాయిస్తే స్వతంత్రులుగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టి తీరుతామని ఆ జిల్లా టీడీపీ నేతలు అధినేతకు హెచ్చరికలు పంపారు. ఈ మేరకు హైదరాబాద్ లో గిద్దలూరు టీడీపీ కార్యకర్తలు బలరాంను కలిశారు. జిల్లాలో బీజేపీకి సీట్లు కేటాయించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తమ విన్నపాన్ని విస్మరించి బీజేపీకి సీట్లు కేటాయిస్తే... స్వతంత్రులుగా పార్టీ కోసం కృషి చేసిన వారిని నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరించారు.