: తెలుగు దేశం పార్టీని వీడటం లేదు: ఎమ్మెల్యే చింతమనేని


తాను తెలుగు దేశం పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలను పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఖండించారు. ఈ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన వివరణ ఇచ్చారు. రాజకీయంగా తనను దెబ్బతీసే విధంగా కొన్ని స్వార్థపర శక్తులు కుట్రపన్నాయన్నారు. సచివాలయంలో సీఎం కిరణ్ ను కలిసిన చింతమనేని ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తనపై ఉన్న కేసులపై విచారణ చేయించి, ఒకవేళ తప్పని తేలితే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి తెలిపినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News