: మోడీని విమర్శించలేదు... మోడీ వివాహ స్థితిని ప్రశ్నించా: రాహుల్ గాంధీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తాను వ్యక్తిగతంగా విమర్శించలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అమేధీలో ఆయన మాట్లాడుతూ, మోడీ అఫిడవిట్ లో పేర్కొన్న స్థితిని ప్రశ్నించానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. ఎవరిపైనైనా, ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, తాను వ్యక్తిగత విమర్శలకు దూరమని ఆయన స్పష్టం చేశారు.