: వైఎస్ కు పంచడం... బాబుకు దోచుకోవడమే తెలుసు: విజయమ్మ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పంచడం తెలిస్తే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం దోచుకోవడమే తెలుసని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. గుంటూరు జిల్లా వలివేరులో వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ జనభేరిలో ప్రసంగించారు. చంద్రబాబు ఎక్కడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదు కానీ, రామోజీరావు, సీఎం రమేష్, మురళీమోహన్ లాంటి వాళ్లకు వేలాది ఎకరాల భూములను దోచిపెట్టారని ఆమె ఆరోపించారు.