: టీడీపీ, బీజేపీ కూటమితోనే తెలంగాణలో అభివృద్ధి: చంద్రబాబు
టీడీపీ, బీజేపీ కూటమితోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని అధినేత చంద్రబాబు అన్నారు. అందుకు మోడీ ప్రధాని కావాలని, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ మేరకు ఈ రోజు హైదరాబాదులో ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో బాబు ప్రసంగించారు. హైదరాబాదు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, తొమ్మిదేళ్లలో సైబరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పారు. ఔటర్ రింగు రోడ్ తమవల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. టీడీపీ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ దోచుకున్నదని ఆరోపించారు. హైదరాబాదును ప్రపంచపటంలో పెట్టిన ఘనత కూడ తమదేనని బాబు చెప్పుకొచ్చారు.
గత పదేళ్లలో కాంగ్రెస్ పాలన అవినీతిలో మునిగిపోయిందని, వారి పాలనలో దొంగల కోసమే ఆర్థిక మండళ్లు ఏర్పాటయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ఒక దొంగలముఠాగా మారిందని మండిపడ్డారు. విభజన తర్వాత తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని, దానికి కారణం తాము చేసిన అభివృద్ధేనని బాబు పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లేనని అన్నారు.