: ఎక్కడ ఆడితే ఏంటి... ఆడేది క్రికెట్టే: ఐపీఎల్ లో చెలరేగుతానంటున్న సెహ్వాగ్
ఎక్కడ ఆడితే ఎంటి? ఆడేది క్రికెట్టే కదా? అని డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్నది పెద్దగా పట్టించుకోనని అన్నాడు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా ఐపీఎల్ మీదే ఉందని ఆయన అన్నాడు. ఐపీఎల్ 7 లో సత్తా చాటుతానని సెహ్వాగ్ తెలిపాడు. మరో మూడేళ్ల వరకు రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశాడు.