: నిమ్మకూరులో ప్రారంభమైన నారా లోకేష్ యువ ప్రభంజనం యాత్ర


సీమాంధ్రలో ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సాయంత్రం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి యువ ప్రభంజనం యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, సీమాంధ్రను నవ్యాంధ్రప్రదేశ్ గా, తెలంగాణను సామాజిక తెలంగాణగా తీర్చిదిద్దడం టీడీపీతోనే సాధ్యపడుతుందని తెలిపారు. ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ను ఓడించే బాధ్యత ఓటర్లపై ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News