: నాగం కారుపై రాళ్లు రువ్విన కొండయ్య వర్గీయులు


మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ నేత కొండయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. పొత్తులో భాగంగా మక్తల్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో... ఆయన మనస్థాపానికి గురయ్యరు. అంతేకాకుండా, మక్తల్ అసెంబ్లీ స్థానానికి వేసిన నామినేషన్ ను కూడా ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో, కొండయ్యను బుజ్జగించడానికి బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి వెళ్లారు. బీజేపీ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న కొండయ్య వర్గీయులు నాగం కారుపై రాళ్లు రువ్వారు.

  • Loading...

More Telugu News