: పవన్ కల్యాణ్ పార్టీ విధానాలపై అవగాహన లేదు: చిరంజీవి


తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ విధివిధానాలపై తనకు అవగాహన లేదని కాంగ్రెస్ ప్రచారకమిటీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ మేనిఫెస్టో తయారు చేశామని అన్నారు. సీమాంధ్రలో ప్రతి ఆడబిడ్డకు వందగజాల ఇంటి స్థలం ఇస్తామని ఆయన తెలిపారు. శాసనసభ, లోక్ సభ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని ఆయన తెలిపారు. పార్టీకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన నష్టం అంతా ఇంతా కాదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News