: జయశంకర్ పేరిట అమరవీరుల కుటుంబాలకు 100 కోట్లతో ట్రస్ట్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేనిఫెస్టోను విడుదల చేసింది. అమరవీరుల కుటుంబాల కోసం ప్రొ. జయశంకర్ పేరిట రూ. 100 కోట్లతో ట్రస్ట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 యేళ్లు చేస్తామని కూడా మేనిఫెస్టోలో చెప్పారు.
ఆ పార్టీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఇవాళ గాంధీభవన్ లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.