: ఐదేళ్లలో ఆ ఎంపీ వయసు 11ఏళ్లు పెరిగిందట!


మీరు ఓ ఐదేళ్ల కాలంలో వయసులో ఎంత పెరుగుతారు? ఇదేం ప్రశ్న అని కోప్పడకండి. ఐదేళ్ల పెరుగుతారు! కానీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇన్నర్ మణిపూర్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన ఎంపీ తోక్ చామ్ మీన్యా వయసు అయితే, ఐదేళ్ల కాలంలో 11 ఏళ్లు పెద్దదయిపోయిందట. ఇదే స్థానానికి మీన్యా తాజాగా సమర్పించిన నామినేషన్లో ఆయన తన వయసును 69ఏళ్లుగా పేర్కొన్నారు. కానీ, 2009 ఎన్నికల సమయంలో మీన్యా తన నామినేషన్లో వయసు 58 ఏళ్లు అనే వెల్లడించారు. అయితే, వయసు రాసే విషయంలో దొర్లిన తప్పువల్లే అలా తేడా వచ్చిందని మీన్యా ఒప్పుకున్నారు.

  • Loading...

More Telugu News