: గత జీవితంపై విచారించడం లేదు: సన్నీలియోన్
ఒకప్పుడు నీలి చిత్రాల్లో రెచ్చిపోయి నటించి, ప్రస్తుతం బాలీవుడ్ నటిగా సెటిలైన సన్నీలియోన్ మరోసారి తన గత జీవితాన్ని సమర్థించుకుంది. గతంలో చేసిన దానికి విచారించడం లేదని, వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదని ఆమె అన్నది. 'నా కెరీర్ కొనసాగుతున్నంత కాలం చేసిన దానికి చింతించను. ఇప్పటి వరకూ నేను చేసిన దానివల్లే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను' అని సన్నీలియోన్ ముంబైలో మేండేట్ మేగజైన్ కవర్ పేజీని ఆవిష్కరించిన సందర్భంగా చెప్పింది. 'ఇది నాకు జీవితంలో ఎంతో అద్భుతమైన కాలం. నా గత జీవితమే లేకుంటే ఈ రోజు ఇది ఉండేది కాదు. కనుక నా గత కెరీర్ విషయంలో బాధపడాల్సిందేమీ లేదు' అని చెప్పింది.