: టికెట్లు దక్కని వారికి ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇస్తాం: కేసీఆర్
సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు దక్కని వారికి తొలి వరుసలో ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. మరికొంతమందికి భవిష్యత్తులో పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ కారణాల వల్లే కొందరికి టికెట్లు కేటాయించలేకపోయామని చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికే ప్రధానంగా సీట్లు ఇచ్చినట్లు కేసీఆర్ వెల్లడించారు. ఇక బడుగు, బలహీన వర్గాలకు 55 శాతం సీట్లు, బీసీలకు 30 శాతం సీట్లు కేటాయించినట్లు వివరించారు. కాగా, రేపు కరీంనగర్ లో బహిరంగ సభ ఉంటుందని, వంద శాతం తెలంగాణలో అధికారం టీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు.