: శ్రీలక్ష్మికి బెయిలొచ్చింది....
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బెయిల్ వచ్చింది. రెండు లక్షల రూపాయలు, ఇద్దరు పూచీకత్తుతో నాంపల్లి కోర్టు కొంచెం సేపటిక్రితం మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. తీవ్ర మనోవ్యధకు గురై శ్రీలక్ష్మి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న కోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో శ్రీలక్ష్మికి ఊరట లభించినట్లైంది.