: ప్రచారానికి బయలుదేరిన నారా లోకేష్


టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి హైదరాబాదు నుంచి బయలుదేరారు. కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి 'యువ ప్రభంజనం' పేరిట ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో పామర్రు, గుడివాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో లోకేష్ ప్రచారం సాగుతుంది. అటు బాబు ఎన్నికల ప్రచారం కూడా నేడు మల్కాజిగిరి నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News