: యువరాజు రాకకు పూల బాట


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడా మజాకా? ఈ రోజు నామినేషన్ వేయడానికి అమేధీకి వస్తున్న రాహల్ కు వీరాభిమానులు, పార్టీ కార్యకర్తలు పూలతో ఘన స్వాగతం పలకనున్నారు. రాహుల్ నడిచేందుకు పూలబాట వేస్తున్నారు. యువరాజు నడిచి వెళ్లేందుకు వీలుగా... 500 కేజీల పూలను సిద్ధం చేశారు. అమేధీలో రాహుల్ కు బీజేపీ నుంచి స్మృతి ఇరానీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కుమార్ విశ్వాస్ సవాల్ విసురుతున్నా, మరోసారి రాహుల్ కు ఘన విజయం కట్టబెట్టాలని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు.

  • Loading...

More Telugu News