: నేటి నుంచి చంద్రబాబు ప్రచారం ప్రారంభం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో పలు ప్రాంతాల్లో రోడ్ షోల ద్వారా ఆయన ప్రచారం చేస్తారు. దీనిలో భాగంగా మధ్యాహ్నం 2.45 గంటలకు ఆయన కూకట్ పల్లి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహిస్తారు. బాలానగర్ లో సాయంత్రం 3.45 గంటలకు, కుత్బుల్లాపూర్ లో 4.15 గంటలకు, సుచిత్ర సెంటర్ లో 4.45 గంటలకు ప్రసంగిస్తారు. ఆ తర్వాత హస్మత్ పేట్, బోయినపల్లి, ఏవోసీ సెంటర్ లలో ప్రచారం నిర్వహిస్తారు. చివరిగా రాత్రి 8.30 గంటలకు మల్కాజిగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.