: అక్రమాస్తులపై షర్మిల వివరణ ఇవ్వాలి: బీజేపీ


వైఎస్ జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త అక్రమ ఆస్తులపై భారతీయ జనతా పార్టీ మరోసారి మండిపడింది. పలు కంపెనీలలో వీరిద్దరికీ వున్న పెట్టుబడులపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేసారు. త్వరలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసి సిబీఐ విచారణకు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. అక్రమాస్తుల విషయంలో తాము చేసిన ఆరోపణలకు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పాదయాత్ర చేసే హక్కు షర్మిలకు లేదన్నారు. తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా  ప్రభాకర్ స్పష్టం చేసారు.

  • Loading...

More Telugu News