: ‘చిట్టీల’రాణి కేసులో 8 మంది అరెస్ట్: డీసీపీ పాల్ రాజు
‘చిట్టీల’ పేరుతో జూనియర్ ఆర్టిస్టుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన టీవీ నటి విజయరాణి కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ పాల్ రాజు తెలిపారు. 72 మందికి విజయరాణి మొత్తం రూ. 2.20 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఆమెకు 20 లక్షలు అప్పుగా ఇచ్చి కోటి రూపాయలు వడ్డీ తీసుకున్నవారు ఉన్నారని డీసీపీ చెప్పారు. విజయరాణి వద్ద అధిక వడ్డీలు తీసుకున్న వారిపై కేసులు పెడతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదు, గుడివాడలో రూ. కోటి విలువైన విజయరాణి ఆస్తులను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.