: పాక్ లో హిందూ మహిళ మత మార్పిడి.. రేగిన నిరసన


పాకిస్తాన్ లో మైనారిటీ వర్గమైన హిందువులకు సరైన రక్షణ లేకుండా పోతోంది. ఓ హిందూ యువతికి మతమార్పిడి చేసి ముస్లిం యువకుడితో వివాహం జరిపించిన ఘటన పాకిస్తాన్ లో నిన్న చోటు చేసుకుంది. విషయం ఏంటంటే, జకోబాబాద్ లోని జాంఝ్రీ ప్రాంతంలో అశోక్ కుమార్ అనే బంగారం వ్యాపారి కుమార్తె గంగకు మరో బంగారం వ్యాపారి కుమారుడైన ఆసిఫ్ అలీతో వివాహం అయింది.

పెళ్ళికి ముందు గంగకు మతమార్పిడి జరిపించారు. ఆమె పేరును ఆసియాగా మార్చారు. ఈ విషయం తెలిసిన గంగ బంధువులు ఆగ్రహోదగ్రులయ్యారు.  తమ కుమార్తెను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి జరిపించి, పెళ్ళి చేశారని గంగ బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా, జకోబాబాద్ లో హిందువులు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగడంతో  అక్కడ జరగాల్సిన హిందూ పంచాయతీ ఎన్నికలు కూడా వాయిదా పడినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News