: రేపు సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ రేపు జరగనుంది. నాలుగు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాలకు రేపు పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 74 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలోని గోవా ఉత్తరం, గోవా దక్షిణం నియోజకవర్గాలకు, అసోంలోని కరీంగంజ్, సిల్చార్, అటానమస్ డిస్ట్రిక్ట్, త్రిపుర తూర్పు నియోజకవర్గం, సిక్కింలోని ఒక నియోజకవర్గానికి రేపు పోలింగ్ జరగనుంది.