: ముగిసిన 'స్థానిక' సమరం
స్థానిక సంస్థలకు జరిగిన తుది దశ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండో విడతలో మొత్తం 7,975 ఎంపీటీసీ, 536 జడ్పీటీసీలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటల్లోపు క్యూలైన్లలో నిలబడిన వారికి ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో... మొత్తం 2,469 జడ్పీటీసీలు, 25,621 ఎంపీటీసీల భవితవ్యం తేలనుంది.