: రేణుకా చౌదరి జోక్యంతో మెత్తబడ్డ రేగ కాంతారావు
ఖమ్మం జిల్లా పినపాక నుంచి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన రేగ కాంతారావు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి జోక్యంతో మెత్తబడ్డారు. ఓ నేత తప్పుదోవ పట్టించడం వల్ల రేణుకా చౌదరిపై విమర్శలు చేశానని కాంతారావు వివరణ ఇచ్చారు. కార్యకర్తలతో చర్చించి నామినేషన్ ఉపసంహరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. నాయకుల పొరపాటు వల్లే పినపాక సీటును సీపీఐకి ఇవ్వాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.