: మా మామ మాటలకు సిగ్గుపడుతున్నాం: నటి ఆయేషా టకియా
సమాజ్ వాదీ పార్టీ నేత అబు ఆజ్మీ వ్యాఖ్యలను ఆయన కోడలు, ప్రముఖ నటి అయేషా టకియా ఖండించారు. సూపర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చిరపరిచితురాలైన అయేషా టకియా ముంబైలో మాట్లాడుతూ, తన మామగారు చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నామని తెలిపారు. ఇది మహిళలను అగౌరవపరిచే చర్య అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
అయేషా భర్త ఫర్హాన్ అజ్మీ కూడా ఆమె మాటలతో ఏకీభవించారు. తనకు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారని, అత్యాచార దోషులను వంద సార్లు ఉరి తీయాలని అన్నారు. తన కుటుంబం మొత్తానిది ఇదే అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ఆయన ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.